లిప్‌స్టిక్‌తో జాగ్రత్త
10-06-2024 12:05 AM
పెదాలు అందంగా కనబడాలని అమ్మాయిలు, మహిళలు లిప్‌స్టిక్ పెట్టుకుంటుంటారు. లిప్‌స్టిక్ లేకుండా కొందరైతే అడుగు కూడా బయటకు వెయ్యరు. మరికొందరైతే 24 గంటలు పెదాలకు లిప్‌స్టిక్‌తోనే ఉంటారు. అయితే పెదాలకు లిప్‌స్టిక్ పెట్టడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. లిప్‌స్టిక్ తయారిలో క్రోమియం, మెగ్నీషియం, లెడ్, కాడ్మియం, పెట్రో కెమికల్స్ ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్స్ కలిసిన లిప్‌స్టిక్‌ను పెదాలకు పెడితే అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. వీటి వాడకం వల్ల ఏ దుష్ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం..
- లిప్‌స్టిక్ తయారిలో వాడే కాడ్మియం వల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాదు.. కడుపులో కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది.
- లెడ్ కెమికల్ నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వంధత్వం, హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.
- లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు శరీర ఎదుగుదల కూడా ఆగిపోతుందని నిపుణులు తెలిపారు.
- లిప్‌స్టిక్‌లో ఉపయోగించే బిస్మత్ ఆక్సీక్లోరైడ్, పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉంది. అంతేకాకుండా ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే కెమికల్స్ వాడిన లిప్‌స్టిక్‌కు దూరంగా ఉండడం మంచిది.






