ప్రెగ్నెన్సీ సమయంలో..
10-06-2024 12:05 AM
గర్భిణీ స్త్రీలలో ఈ మధ్య గ్యాస్ట్రోఎంటెరిటిస్, లూజ్ స్టూల్స్, జాండిస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తల్లిగా మారాలనుకునే మహిళలు కొన్ని అనారోగ్య పరిస్థితుల బారిన పడుతున్నారు. దీంతో గర్భస్రావం జరుగతుంది. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీల కోసం సురక్షితమైన ఆహారపు అలవాట్లపై ఆచరణీయ సూచనలు ఎంటో తెలుసుకుందాం..
- కుటుంబంతో కలిసి బయట తినాలనుకున్నప్పుడు పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లండి. వీటిని గుర్తించడానికి ఆన్‌లైన్ రివ్యూలను చదివి తెలుసుకోవాలి.
- ఒక వేళ ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు.. తాజాగా వండిన వేడివేడిగా వడ్డించే వంటకాలను ఆర్డర్ చేయండి.
- చేపలు తినే ముందు బాగా వండారా లేదానేది పరిక్షించాలి. లేదంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా దరిచేరుతుంది.
- ప్యాక్ చేసిన సలాడ్‌లు, నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకుండా ఉండడం మంచిది.
- ఆహారం తినే ముందు సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడగాలి.
- సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించడం మంచిది.
- ముఖ్యంగా ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం శ్రేయస్కరం.
- పానీ పూరీ, జల్ జీరా, చెరకు రసం, మొలకలు, స్ప్రౌట్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది.
- మిగిలిపోయిన వాటిని తినడం మానేయండి. ప్రత్యేకించి వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం చాలా ప్రమాదం.






