calender_icon.png 1 May, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడదెబ్బతో జాగ్రత్త!

27-04-2025 12:00:00 AM

వేసవి కాలంలో చాలామంది వడదెబ్బ వస్తుందేమోనని ఆందోళన చెందుతారు. అయితే ఈ ఐదు చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవి కాలంలో వడదెబ్బ ఒక పెద్ద సమస్య. ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. హీట్ స్ట్రోక్ కారణంగా మీకు తలనొప్పి, తల తిరగడం, వాంతులు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు. సన్ స్ట్రోక్‌ణు నివారించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవి శరీరానికి చాలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఎక్కువ నీరు తాగడం

శరీరాన్ని చల్లబరచడానికి, రోజంతా వీలైనంత ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతో పాటు మజ్జిగ, యాపిల్ జ్యూస్, పుచ్చకాయ రసం కూడా తాగవచ్చు.

బయటకు వెళ్లొద్దు..

మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటకు వెళ్లడం చాలా ముఖ్యం అయితే గొడుగు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

దుస్తుల విషయంలో..

వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలి. ఇది శరీరాన్ని చల్లగా చేస్తుంది. అంతేకాకుండా హీట్ స్ట్రోక్ వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వేడి పదార్థాలు తినొద్దు..

వేసవి కాలంలో ఎంత చల్లటి ఆహారం తింటే శరీరం అంత మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు టీ, కాఫీ, వేయించిన ఆహారాలు వంటి వేడి పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

ఈ లక్షణాలు ఉన్నాయా?

జ్వరం, ముఖం ఎర్రబడటం, వాంతులు, తలతిరగడం లేదా తలనొప్పి ఉంటే.. ఇవి హీట్ స్ట్రోక్ లక్షణాలు కావచ్చు. దీన్ని నివారించడానికి వెంటనే చల్లగా అనిపించే ప్రదేశానికి వెళ్లడం, చలువచేసే జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలి.