calender_icon.png 18 July, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని

17-07-2025 06:14:05 PM

మంత్రి వివేక్ తన పదవికి రాజీనామా చేయాలి

బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి రాజా రమేష్ 

చెన్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి రాజా రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోటపల్లి మండల కేంద్రంలో ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ... రైతుల పట్ల ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా నియోజక వర్గ కేంద్రానికి వచ్చి రైతులకు సరిపడా యూరియా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. దళితుల కోటలో మంత్రి పదవి వచ్చిన సంగతి మర్చిపోవద్దని, దళిత, గిరిజనులకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.