calender_icon.png 18 July, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యాక్స్ సిబ్బందిని సన్మానించిన చైర్మన్

17-07-2025 06:34:14 PM

ఇల్లంతకుంట:(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండల  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఎఫ్పీఓ రైతు ఉత్పత్తి సంస్థగా గుర్తించడానికి అహర్నిశలు కృషిచేసిన సీఈవో, సిబ్బందికి అభినందలు తెలియజేస్తూ శాలువతో సత్కారం చేసిన ప్యాక్స్ చైర్మన్ గొడుగు తిరుపతి. ఎఫ్పీఓ ద్వారా రానున్న రోజుల్లో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రైస్ మిల్లులు, శీతల గిడ్డంగులు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడాని రైతు ఆర్థికంగా ఎదగడానికి ఎఫ్పీఓ దోహదపడుతుందని, దీనిని రైతులందరూ ఉపయోగించుకోగలరని తెలిపారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘంలో దీర్ఘకాలిక కర్షక మిత్ర రుణాల కింద 13 మంది రైతులకు మంజూరు అయిన 86 లక్షల రూపాయల చెక్కులను రైతులకు చైర్మన్ అందజేశారు. ఇందులో డైరెక్టర్ గజ్జల సత్తయ్య, సీఈవో చిట్టి రవీందర్ రెడ్డి, రైతులు ఎలుగుమెట్ల అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.