17-07-2025 06:45:47 PM
ఒక్క కార్యాలయం.. ఒకే సీటు.. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు బాధ్యతలు
పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిషత్ అధికారిగా ఏ.జానయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా ఇక్కడ విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావు నల్గొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో బుధవారం రోజు సూర్యాపేట ఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తున్న బాలకృష్ణ ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే మరుసటి రోజు గురువారం నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం ఎంపీడీఓగా విధులు నిర్వర్తించి బదిలీపై వచ్చి పెన్ పహాడ్ ఎంపీడీవోగా జానయ్య బాధ్యతలు స్వీకరించారు. ఒక్క కార్యాలయానికే..ఒక్క సీటుకే.. ఒక్క రోజు వ్యవధిలో బది'లీలలు' జరగడం పై చర్చనీయంగా మారింది.