27-04-2025 12:00:00 AM
ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ గా ఉన్న ఆహారాన్ని ఖాళీ కడుపుతో తింటే గుండెల్లో మంటగా అనిపిస్తుంది.
పండ్లు ఆరోగ్యానికి మంచిదే.. కానీ సిట్రస్ ఫ్రూట్స్ అయిన నిమ్మ, నారింజ వంటి వాటిని పరిగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.
కొందరికి ఉదయాన్నే కాఫీ, టీలు తాగడం అలవాటు. కానీ ఏం తినకుండా ఇవి తీసుకుంటే ఎసిడిటీ ఇబ్బంది పెడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చల్లటి జ్యూస్‌లు తాగొద్దు. వాటిలో ఉండే కార్బోనేటెడ్ పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తుంది.
పరిగడుపున తీపి పదార్థాలు తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరుగుతుంది. జీర్ణాశయంలోని ఎంజైములు బద్ధకంగా మారతాయి.
నూనెలో డీఫ్ ఫ్రై చేసిన ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోకూడదు. దీనివల్ల నీళ్లను ఎక్కువగా తాగడంతో పాటు పొట్ట ఉబ్బరం, అజీర్తి ఇబ్బంది పెడతాయి.