calender_icon.png 18 July, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యలకు పరిష్కారం చూపాలి

17-07-2025 06:47:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర బంద్ కు నిర్ణయించిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బోనగిరి మధు, పట్ల మధు, మేక వెంకటేష్ పేర్కొన్నారు.

ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి ఏర్పడిందని, ఎన్నికలకు ముందు విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని విశ్వరించారని ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న 8500 కోట్ల స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనేక హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమం సాగిస్తామని ప్రకటించారు.