calender_icon.png 17 July, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శిగా తాండ్ర సదానందం

17-07-2025 06:20:37 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సిపిఐ కార్యదర్శిగా మూడవసారి తాండ్ర సదానందం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాండ్ర సదానందం మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి పార్టీ అధినాయకత్వం, జిల్లా కార్యవర్గ సభ్యులు మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను స్వీకరించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన తాండ్ర సదానందం శుభాకాంక్షలు తెలియజేశారు.