calender_icon.png 18 July, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ పోలీస్ అధికారుల నియామకం!

17-07-2025 06:16:21 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం కాలనీ పోలీస్ (సిపిఓ) అధికారులను నియమించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి తెలిపారు. కాలనీ వారిగా నియమించిన కాలనీ పోలీస్ అధికారులు తమ పరిధిలో నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడం, కాలనీ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెంచడం, కాలనీవాసుల సమన్వయంతో  సమగ్ర సమాచారంతో ముందుకు సాగేలా చర్యలు చేపడతారని సిఐ తెలిపారు.