calender_icon.png 18 July, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్ద కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు న్యాయం చేయాలి

17-07-2025 06:40:35 PM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోరుతూ అద్దంకి దయాకర్ కు దరఖాస్తు సమర్పించిన కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): దాదాపు దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజా సంక్షేమం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శ్రమించిన వాట్ ఇస్ క్రియాశీలక కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వారి రాజకీయ విధులకు సహకరించాలని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థ గత పునర్నిర్మాణ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిపిసిసి ఇన్చార్జ్ అద్దంకి దయాకర్ కి అందజేసిన వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుండి ప్రస్తుత డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ గతంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మాజీ సింగిల్ విండో చైర్మన్ గా మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు రెండు దశాబ్దాల నుండి  కష్టపడుతున్నానని మా కష్టాన్ని గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అవకాశం కల్పించాలని కోరుతూ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అద్దంకి దయాకర్ కి దరఖాస్తు ఫారం అందజేసిన్నారు.