7 August, 2026 | 2:13 AM

ప్రతీ సవాల్‌కు సిద్ధంగా ఉండండి

07-08-2026 12:00 AM
  1. భారత క్రికెటర్లకు గంభీర్ సూచన
  2. మన లక్ష్యం ఏంటో తెలుసు : గంభీర్
  3. అన్ని విభాగాల్లో రాణించాల్సిందే

కొలంబో, ఆగస్టు 6: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చాలా కీలకం. ఫైనల్ రేసులో నిలవాలంటే లంక గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సిందే. కానీ ఏడాదికాలంగా టెస్టుల్లో మన ఆటతీరు దిగజారింది. హెడ్ కోచ్‌గా గంభీర్ వచ్చాక భారత్ వరుస పరాభవాలు చవిచూసింది. దీంతో లం కతో టెస్ట్ సిరీస్ గంభీర్‌కు కూడా అగ్ని పరీక్షగా మారింది.

ఈ నేపథ్యంలో శ్రీలంకలో తొలి ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆటగాళ్లందరికీ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు.గంభీర్ స్పీచ్‌కు సంబంధించిన వీడియోనుబీసీసీఐ ఎక్స్‌లో పోస్టు చేసింది.  ప్రాక్టీస్ సెషన్ ప్రారంభానికి ముం దు కొత్త కుర్రాళ్లు సారాంశ్ జైన్, ఆకిబ్ నబీకి గంభీర్ టీమ్‌లోకి స్వా గతం పలికాడు. అనంతరం జట్టునుద్దేశించి గంభీర్ మాట్లాడాడు. లంక సిరీస్‌లో ఎదురయ్యే ప్రతీ సవాల్‌కు సిద్ధంగా ఉండాలన్నాడు.

‘మన ముందున్న లక్ష్యం ఏమిటో మీకు అందరికీ తెలుసు. మనం దేని కోసం ఆడుతున్నామో కూడా తెలుసు. పరిధిని దాటి కష్టపడాలి. ఆగస్టు 15న ఆడనున్న టెస్టులో మనం మొదట బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా సరే, మనకు ఎదురయ్యే ఏ ప్రశ్నకైనా సమాధా నం ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఇప్పటి నుంచే అన్ని అంశాల్లోనూ మనం పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. మన జట్టులోకి ఇద్దరు కొత్త ప్లేయ ర్లు వచ్చారు.

సూర్యాంశ్ నువ్వు ఎంతో కష్టపడి ఇక్కడిదాకా వచ్చా వు. అవకాశం దొరికినప్పుడు కు టుంబాన్ని, దేశాన్ని గర్వపడేలా చే యాలి. ఆకిబ్ గత రంజీలో నువ్వు అద్భుతంగా ఆడావు. జమ్ముకశ్మీర్ విజయంలో నీ పాత్ర అత్యం త కీల కం. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. ఇక వీళ్లతోపాటు మన జట్టులోకి ఫీల్డిం గ్ కోచ్ శుభదీప్ ఘోష్ వచ్చారు.

ఆయన గతంలో పలు జట్లకు పని చేశారు. ఘేష్ తన అనుభవం, నిబద్ధతో మనల్ని ముందు కు తీసుకెళ్తా రని ఆశిస్తున్నానంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం నుంచి మూడు రోజుల వా ర్మప్ మ్యాచ్ జరగనుండగా, లం కతో తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది. గతేడాది డిసెంబర్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికాపై 2- సిరీస్ కోల్పోయిన తర్వాత డబ్ల్యూటీసీలో భారత్‌కు ఇదే తొలి సిరీస్.