ఒకే గ్రూప్‌లో భారత్, పాక్
- సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థుల పోరు
- మహిళల ఆసియాకప్ షెడ్యూల్ విడుదల
దుబాయి, ఆగస్టు 6 : ప్రపంచ క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి అభిమానులను అలరించబోతున్నాయి. మహిళల ఆసి యాకప్ వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 5న దాయాదుల క్రికెట్ సమరం జరగబోతోంది. తాజాగా మహిళల ఆసియాకప్ షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఊహించినట్టుగానే యూఏఈ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీలో భారత్ , పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి.

గ్రూప్ ఏలో భారత్, పాక్‌తో పాటు థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లు ఉం డగా, గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూ ఏఈ, ఇండోనేషియా చోటు దక్కించుకున్నాయి. రౌండ్ రాబినా ఫార్మాట్‌లో టోర్నీ జరుగుతుంది.
ఆగస్టు 28న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో థాయ్‌లాండ్, హాంకాంగ్ చైనా జట్లు తలపడతాయి.భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న థా య్ లాండ్ ను ఢీకొంటుంది. సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తోనూ, సెప్టెంబర్ 5న పాకిస్థాన్ తోనూ తలపడుతుంది.
సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్, సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్ జరగనుండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. అన్ని మ్యాచ్ లకూ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఆసియాకప్ లో భారత్‌కు అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకూ ఏడుసార్లు టైటిల్ గెలిచింది.ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరలేకపోయి న భారత్ ఆసియాకప్‌లో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. శ్రీలంక మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
గ్రూప్ ఏ : భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్
గ్రూప్ బి : శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా






