7 August, 2026 | 2:29 AM

గిల్‌కు గాయం

07-08-2026 12:00 AM

కొలంబో, ఆగస్టు 6 : భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బుమ్రా లంకతో సిరీస్‌కు దూరమవగా, సాయిసుదర్శన్ జట్టుతో చేరడంపై స్పష్టత లేదు. తాజాగా కెప్టెన్ శుభమన్ గిల్ గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. లంక ఎలెవన్‌తో జరిగే వార్మప్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడ్డాడు.

నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ పేసర్ వేసిన బంతి గిల్ కుడి బొటనవేలికి బలంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడిన అతడికి వెంటనే ఫిజియో చికిత్స అందించారు. అయితే గాయం తీవ్రమైనది కాకపోవడంతో కొద్దిసేపటి తర్వాత గిల్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారం భించాడు. అయితే కాసేపటికే మరోసారి గాయమైంది.

ఫీల్డింగ్ డ్రిల్స్ సమయంలో స్లిప్స్లో క్యాచ్‌లు పట్టడంపై ప్రాక్టీస్ చేస్తుండగా అతడి కుడి చేతికి దెబ్బ తగిలంది. దీంతో ఫిజియో ఐస్ ప్యాక్‌తో చికిత్స అందించారు. అనంతరం కూడా నొప్పి తగ్గకపోవడంతో గిల్ మైదానం వీడాడు.  కాగా కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్ టీమిండియా ఫీల్డింగ్ డ్రిల్స్‌ను నిశితంగా పరిశీలించాడు.