నవోదయలో మొండిచేయి!
- ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా పట్టించుకోని కేంద్రం!
నిర్మల్, డిసెంబర్ ౮ (విజయక్రాంతి): ఆదివాసీల ఆదిలాబాద్ జిల్లా అక్షరాస్యతలో వెనుకబడినా.. విద్యా ప్రణామాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఈ జిల్లాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నవోదయ విశ్వవిద్యాయయాల ఏర్పాటులో మొండిచేయి చూపింది.
దీంతో ఉమ్మడి జిల్లా విద్యార్థుకు తీవ్ర అన్యాయం జరిగినట్టయిందని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నా నవోదయ విశ్వవిద్యాలయం మంజూరు కాకపోవడం బాధాకరం.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. సుమా రు 30 లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1993లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నవోదయ విశ్వవి ద్యాలయమే ఉన్నది.
ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు, ఏస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన బీసీలే ఎక్కువగా ఉంటారు. వీరు రూ.లక్షలు ఖర్చు చేసి తమ పిల్లలకు నవోదయ కోచింగ్ ఇప్పించుకోలేరు. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్నవా రు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కోచింగ్ తీసుకుని సీట్లు సాధిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, విద్యావంతులు 2016 నుంచి కేంద్రాన్ని కోరు తూ వస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో హామీలు కూడా ఇచ్చారు. అయితే తాజాగా కేంద్రం తెలంగాణకు 7 నవోదయాలను మం జూరు చేసింది. అందులో ఉమ్మడి ఆదిలాబాద్‌కు చోటు లేకపోవడంతో జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా ప్రయోజనం లేకుండాపోయిందని ప్రజలు అంటున్నారు.






