ఉత్సాహంగా న్యాయశాఖ క్రికెట్ టోర్నమెంట్
విజేతగా నిలిచిన సిటీ సివిల్ కోర్టు
హైదరబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నగరంలోని ఎల్బీ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగులకు ఆదివారం ప్రారంభించిన క్రికెట్ టోర్నమెంట్లో సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టు, మేడ్చల్ కోర్టు మరియు సిటీ క్రిమినల్ కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. అఖిలభారత శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బోద లక్ష్మారెడ్డి , రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య పోటీలను ప్రారంభించారు. మొదట సిటీ సివిల్ కోర్టు క్రికెట్ టీం, రంగారెడ్డి కోర్టు టీం పోటీ పడగా సిటీ సివిల్ కోర్టు టీం విజయం సాధించింది.
అనంతరం సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి టీం, మేడ్చల్ కోర్టు టీం పోటీ పడగా సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి టీం విజయం సాధించింది. ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు టీం, సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి టీం పోటీపడగా సిటీ సివిల్ కోర్టు టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోటీశ్వర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిటీ సివిల్ కోర్టు వజ్రం ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు అందజేశారు. క్రిమినల్ కోర్టు నుంచి శ్రీధర్, సంజీవరెడ్డి, సివిల్ కోర్టు నుంచి ఉదయ్ కుమార్, నరేష్ కుమార్, రాకేష్ కుమార్, మల్కాజిగిరి కోర్టు అధ్యక్షుడు వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.






