calender_icon.png 17 July, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

17-07-2025 01:06:39 AM

పోలీస్ కమిషనర్ బి.అనురాధ

సిద్దిపేట క్రైం, జులై 16 : ‘యూపీఐ పేమెంట్స్ చేస్తాం బదులుగా నగదు కా వాలి‘ అని అడిగేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ బి.అనురాధ ప్రజలను హెచ్చరించారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కమిషన్ ఆశ చూపి,  వారు సైబర్ నేరాల ద్వారా ఆర్జించిన సొమ్మును పలు దుకాణాల యజ మానుల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నారని తెలిపారు.

ఇటువంటి ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే డయల్ 100 లేదా 8712667100 నెంబర్ కు ఫోన్ చేయాలని సీపీ అనురాధ సూచించారు .