calender_icon.png 13 August, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క రోడ్డు!

07-08-2025 12:49:54 AM

  1. ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఒక మంత్రి శంకుస్థాపన 

నత్తనడకన నడుస్తున్న రోడ్డు పనులు 

కొమిరెడ్డి పల్లి నుంచి షేక్‌పల్లి బిటి రోడ్డు వేగవంతం చేయాలంటున్న ప్రజలు 

గండీడ్ ఆగస్టు : శంకుస్థాపనలు చేసినంత శరవేగంగా పనులు జరగవు.. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ నెలలు కాదు కదా సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతా ల్లో వివిధ పనులు నత్త నడకన నడుస్తున్నా యి. ప్రజా ప్రతినిధులు ఆయా పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ పన్నుల్లో వేగం మా త్రం కనిపించడం లేదు.

గత రెండేళ్ల క్రితం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పరిగి ఎమ్మె ల్యే మహేష్ రెడ్డి సంయుక్తంగా గండీడ్ మం డలం కొమిరెడ్డిపల్లి నుంచి హన్వాడ మండ లం షేక్ పల్లి గ్రామానికి దాదాపు మూడున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు వేసేందుకు శంకుస్థాపన చేశారు.

పనులకు మాత్రం శ్రీకారం చుట్టలేదు. తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రా మ్మోహన్ రెడ్డి గత కొన్ని నెలల క్రితం మరో మారు శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ శరవేగంగా పనులు జరగకపోవడంతో ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేతలు పనులు వేగంగా జరిగేలా చూడాలని రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. 

రోడ్డు పక్కనే ప్రమాదకరంగాబావి

ఏండ్ల తరబడి బీటీ రోడ్డుకు నోచుకోని ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన పెద్ద బావి ఉం ది. బీటి రోడ్డు వేసేందుకు పలు చర్యలు తీ సుకోవడంతో రోడ్డు ఎత్తు  పెరగడంతో  ప క్కనే ఉన్న బావి దగ్గర తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యం అనే మాటకు చావులే కుండా అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఈ బావి చుట్టూ కంచె అయి న లేదా బావిని పూడ్చేందుకు అయిన చర్య లు తీసుకుంటే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకుండా ఉంటుంది. 

చాలాసార్లు రోడ్డు కావాలని కోరాం

షేక్ పల్లి నుంచి కొంరెడ్డిపల్లి వరకు రోడ్డు మార్గం వేయడానికి చాలా కష్టప డ్డాం. షేక్ పల్లి గ్రామ రైతులతో కొంరెడ్డి పల్లి గ్రామ రై తులతో మాట్లాడి రోడ్డు వేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  కుర్రోడు వేసేందుకు ఒప్పుకొ ని వారిని సంజాయించడా నికి, రెండు గ్రామా పొలాల రైతులు అందరూ సహకరించారు.  రోడ్డు మార్గం చెయడానికి. ప్రభుత్వాలు మారినాయి అయినప్పటికీ  రోడ్డు ఇంత వరకు పూర్తి కావడం లేదు. చాలా నిదానంగా పనులు జరుగుతున్నాయి. వేగంగా చేస్తే బాగుంటుంది. 

 రఘు, మాజీ సర్పంచ్, షేక్ పల్లి గ్రామం 

రోడ్డు వేస్తేనే ఎంతో మేలు..

రోడ్డు వేస్తేనే చాలా మేలు జ రుగుతుంది. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ గా ఉంటుంది. ఇప్పటికైనా వెంటనే స్పం దించి వేగంగా రోడ్డు వేయాలని విన్నవిస్తున్నాం. 

         శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి, గండీడ్ మండలం