calender_icon.png 22 November, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుభీర్ ఉన్నత పాఠశాలలో బ్యూటీషియన్ వృత్తి విద్యా కోర్సు ప్రారంభం

22-11-2025 04:00:58 PM

కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రమైన కుభీర్ ఉన్నత పాఠశాలలో వృత్తి విద్యా విభాగం నుండి మంజూరు అయిన బ్యూటీషియన్ కోర్సు మెటీరియల్, ఇన్స్ట్రక్టర్ అందుబాటులోకి రావడంతో, ఈరోజు పాఠశాలలో కోర్సు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యా అధికారి శ్రీ విజయ్ కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ డి. సురేష్, అలాగే కుభీర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్. గంగాధర్ గార్లు కోర్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్యూటీషియన్ వృత్తి విద్యా కోర్సు ముఖ్యంగా బాలికల భవిష్యత్‌కి ఎంతో ఉపయోగకరమని, ఈ కోర్సు ద్వారా విద్యార్థినులు నైపుణ్యాలను, జీవనోపాధి సంపాదించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్ శివజ్యోతి, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.