22-11-2025 03:56:05 PM
రాజ్యసభ సభ్యులు డాక్టర్ అనిల్ సుక్దేవరావు బోండే
మహబూబాబాద్,(విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశ ప్రజలంతా ఐక్యతతో జీవిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు అనిల్ సుక్దేవరావు బొండే అన్నారు. శనివారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో సర్దార్ 150 ఐక్యత పాదయాత్రను మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియం నుండి కోర్టు సెంటర్ వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు అనిల్ సుగ్దేరావు బొండే, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో కె.అనిల్ కుమార్, పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విడివిడిగా ఉన్న భారతదేశంలో ఏకతాటిపై నడిపించిన గొప్ప మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన కొనియాడారు.
భారతీయులంతా స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని, పటేల్ అనుసరించిన దృఢ సంకల్పాన్ని నేటి యువతరం అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడవాలని, చెడు వ్యసనాలు, డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు.
భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్క నాటి నీరు పోసి, జెండా ఊపి పాద యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరిండెంట్ బానోతు దేవిలాల్, డివైఎస్ఓ, ఓలేటి జ్యోతి, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి మదార్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వందల మంది విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.