22-11-2025 03:58:00 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎస్జీఎఫ్ఐ అండర్ 14, అండర్ 17 ఎంపిక క్రీడోత్సవాలు మహబూబాబాద్ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నందు, నిర్వహించగా అత్యంత ప్రతిభ కనబరిచిన కేసముద్రం (స్టే)జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రుచిత అండర్ 17 విభాగం, అండర్ 14 విభాగంలో, అలినా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెడ్మాస్టర్ బందే ల రాజు, ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్ తెలిపారు.
రుచిత ఈనెల 25, 26 తేదీలలో తేదీలలో కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించనున్నదని, అలాగే అలినా ఈనెల 28, 29 తేదీలలో మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, మధు, గిరి , సదయ్య, నరసింహారెడ్డి, మదన్మోహన్, సురేష్, గందసిరి శ్రీనివాస్, భద్ర సింగ్, కే.శ్రీనివాస్, కుమారస్వామి, సత్యనారాయణ, నాగయ్య, జ్యోతి, లక్ష్మి కుమారి, కృష్ణవేణి, యాదగిరి అభినందించారు.