24-01-2025 12:00:00 AM
రోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన, అందమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు. దీంతో హెర్బల్ టీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ నేపథ్యంలో రోజ్ మేరీతో కలిగే లాభాలను తెలుసుకుందాం..
* రోజ్ మేరీ ఆకుల వాసన ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ అందిస్తుంది. కాసేపు ఈ సువాసన పీల్చడం వల్ల ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
* రోజూ పది నిమిషాలు ఈ వాసన పీల్చడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
* మన శరీరానికి విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* రోజ్ మేరీ వాటర్ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే కడుపుబ్బరం తగ్గుతుంది. ఇంకా ఊబకాయం రాదు.
* రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.
* ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెఫ్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
* మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* కళ్లకు రక్షణ ఇస్తుంది. ఇంకా చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.