24-01-2025 12:00:00 AM
ప్రతి ఒక్కరికీ సెల్ఫ్ అవేర్‌నెస్ (స్వీయ అవగాహన) ఎంతైనా అవసరం. అంటే.. ఎవరి గురించి వాళ్లకి ఒక అవగాహన అనేది ఉండాలి. అప్పుడే జీవితంలో చాలా విషయాల్లో బెటర్‌గా ఉండగలుగుతారు. చాలాసార్లు ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ వల్లే పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ముందుకు సాగగలుగుతారు. సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది లైఫ్‌లో చాలా చోట్ల కీలకమైన క్వాలిటీ. ఆలోచనలు, ఫీలింగ్స్.. అవి ఎదుటివాళ్ల మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? వాటికి ఎంత విలువ ఇవ్వొచ్చు? వంటివి చాలా లోతుగా అర్థం చేసుకోగలగాలి.
అలా అర్థం చేసుకోవాలంటే.. సెల్ఫ్ అవేర్‌నెస్ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎమోషన్స్, ఆలోచనలు, నమ్మకాలు.. జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది తెలుసుకోవడమే ఇది. ఇవన్నీ తెలుసుకుంటే.. బలం, బలహీనతలు తెలుస్తాయి.
వాటితో పాటు జీవితంలో ఎదిగేందుకు ఏవి అవసరమో తెలుస్తుంది. తీసుకునే నిర్ణయాల వెనక కారణాలు. వాటివల్ల ఎలాంటి మార్పు వచ్చింది? అనే విషయాలపై అవగాహన వస్తుంది. సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది అందరికీ ఉండదు. అందుకని ఎవరికి వాళ్లు ఆ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి.