18 April, 2026 | 11:50 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను రద్దు చేయాలి

30-05-2025 12:00 AM

- 31న జరిగే గ్రాండ్ ఫినాలేని రద్దు చేయాలి

- మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక

ఖైరతాబాద్: మే 29 (విజయక్రాంతి) : మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ప్రపంచ అందగత్తెల పోటీలను రద్దు చేయాలని మిస్ వరల్ అందాల పోటీల వ్యతిరేక వేదిక డిమాండ్ చేసింది.

ఈ మేరకు  ‘అందాల పోటీలు- మార్కెట్ రాజకీయాలు‘ అనే అంశం పైన ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఓడబ్ల్యు సంధ్యతో పాటు పలువురు మేధావులు, రచయిత్రులు కళాకారులు, ప్రజాస్వామ్య వాదులు హాజరై మాట్లాడారు..72వ మిస్ వరల్ అందాల పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు  చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు.

మహిళల శారీరక కొలతలు, అంగాంగ ప్రదర్శనలు చేసే వేదికలుగానే ఈ పోటీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీలు మహిళ ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ వారిని మార్కెట్లో ఒక వస్తువుగా దిగజార్చే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయని దుయ్యబట్టారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా ల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, చేనేత పరిశ్రమకు చేయూతను అందించేందుకు , పర్యాటక రంగం అభివృద్ధికి ఈ మిస్ వరల్ అందాల పోటీలు దోహదపడతాయని ప్ర భుత్వం చెబుతుందన్నారు. కానీ ఈ పోటీల అసలు ఉద్దేశం కాస్మొటిక్ కంపెనీలకు వేల కోట్ల రూపా లాభాలు సంపాదించుకునే అ వకాశం కల్పించడానికి అని ఆరోపించారు.

ఇలాంటి అందాల పోటీలను రద్దు చేసేందుకు ఏర్పడిన మహిళా, విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలను ఇటీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అందాల పోటీలకు వ్యతి కొద్దిరోజులుగా జరుగుతున్న ఐక్యవేదిక నిరసన లను రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణచివేస్తుందని అన్నారు.

మిల్లా మాగీ విమర్శల తర్వాతైనా ప్రభుత్వం అందాల పోటీల పై పునరాలోచన చేయాలని తెలిపారు. ఈ నెల 31న జరిగే గ్రాండ్ ఫినాలేని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.