18 April, 2026 | 10:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పేదోడి గూడు, గోడు పట్టించుకున్నది కాంగ్రెస్సే

30-05-2025 12:00 AM

మంత్రి సీతక్క 

మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): నాడు.. నేడు.. ఏనాడైనా నిలువ నీడలేని పేదవాడికి గూడు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల హక్కు పత్రాలను అందించారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల ఊహగానే మిగలకుండా, అర్హులైన ప్రతి నిలువ నీడలేని పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇండ్లను కేటాయించడం జరిగిందన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో అదనంగా మరికొన్ని ఇందులో మంజూరు చేసి పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను అనుసరించి లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని, అధికారుల సూచనలను సలహాలను తప్పకుండా పాటించి తక్కువ ఖర్చుతోనే ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఐటిడిఏ పరిధిలో గిరిజన కుటుంబాలకు అదనంగా ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.