21-11-2025 10:38:10 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి అంతర్గత పైప్ లైన్ల ద్వారా బాలుర, బాలికల వసతి గృహాలకు ఇరవై గంటల నీటి సౌకర్యాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ ఆచార జాతి రవికుమార్, ఓఎస్డి టు విసి డాక్టర్ డి.హరికాంత్, వసతి గృహాల వార్డెన్లు, ఇంజనీర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.