calender_icon.png 21 November, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ సాయిల్ క్వాలిటీ కిట్ మీద అవగాహన కార్యక్రమం

21-11-2025 10:41:18 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణంలోని భూసార పరీక్ష కేంద్రం నందు రైస్ సాయిల్ క్వాలిటీ కిట్ మీద అవగహన కార్యక్రమం జిల్లాలోని మండల హెడ్ క్వాటర్ వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి జిల్లా వ్యవసాయధికారి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారు రూపొందించిన ఈ కిట్టు వరి పండించిన నేల యొక్క భూసార పరీక్ష చేయడానికి ఉపయోగపడుతుందని, ఈ కిట్టు సహాయంతో వ్యవసాయవిస్తరణ అధికారులు వారి క్లస్టర్ లో మట్టి నమూనాలు పరీక్షించి ఫలితాలు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎ ఆర్ ఎస్ డిడిఎ ఉషారాణి, వ్యవసాయధికారులు మరియు వ్యవసాయవిస్తరణ అధికారులు పాల్గొన్నారు.