01-05-2025 12:36:32 AM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు
గద్వాల, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ) : గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి తాగు నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.
ఇంకొక గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈ.ఈ శ్రీధర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఈ.ఈ శ్రీనివాస రావు, వైద్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సంధ్య కిరణ్ మయి, కమిటీ సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.