14-12-2025 08:15:28 PM
కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఎంతో వైభవంగా జరిగిన మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని కళ్యాణం తిలకించారు. లోక కల్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమం అంతా మంచి జరగాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రాజేందర్ రెడ్డి కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయిని లక్ష్మా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొండ నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ రంగనాయకమ్మ, నరేందర్, సబితా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.