14-12-2025 08:49:09 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలకు ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయింది. మిగిలిన 21 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికల్లో భాగంగా జలార్పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఆత్మకూరు సర్పంచ్ ఉమ్మన్నగారి లక్ష్మి, చిన్న ఆత్మకూర్ సర్పంచ్ లక్ష్మీ లచ్చయ్య, జానకంపల్లి సర్పంచ్ వర్షిని, మెల్లకుంట తండా సర్పంచ్ బాల్య నాయక్, బెజ్గం చెరువు తండా సర్పంచిగా భాస్కర్, చినూర్ గ్రామ సర్పంచ్ మురళి గౌడ్, వాడి సర్పంచ్ మహేందర్, మాల్తుమ్మెద సర్పంచ్ పుప్పాల సాయిలు, వదలపర్తి సర్పంచ్ సత్యబోయిన పద్మ, గోలి లింగాల సర్పంచ్ బుర్రకాయల రోజా, బొల్లారం సర్పంచ్ ప్రభు గౌడ్, బంజర తండ సర్పంచ్ సురేష్, మాటూర్ సర్పంచ్ భాగ్య, రఘవపల్లి సర్పంచ్ నార్ల గంగమణి, కన్నారెడ్డి సర్పంచ్ సాయిలు, లింగంపల్లి సర్పంచ్ గోపాల్ గౌడ్, గోపాల్పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, తాండూర్ సర్పంచ్ అభ్యర్థులుగా నలుగురు పోటీ చేయగా అందులో భూమా యాదవ్ గౌడ్, కుమ్మరి సిద్ధిరాములకు సమానంగా ఓట్లు రావడంతో ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. రికార్డింగ్ జాయింట్ కలెక్టర్ విల్సన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కొనసాగుతుంది.