14-12-2025 08:29:18 PM
మునుగోడు (విజయక్రాంతి): మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిచిన అభ్యర్థి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన కిష్టాపురం గ్రామానికి చెందిన చెనగొని కాటంరాజు(45) ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ నుండి పోటీ చేశాడు. గత బుధవారం జరిగిన ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 143 ఓట్లతో ఓడిపోయాడు.
అప్పటినుంచి తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం స్వగ్రామంలో ఓ వ్యక్తి ఇంటిదగ్గర మాట్లాడుతూ హఠాత్తుగా సొమ్మసిల్లీ పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాటంరాజు అకాల మృతి పట్ల ఆ గ్రామంలోని ప్రజలు శోకసముద్రంలో ఉన్నారు.