calender_icon.png 15 December, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

14-12-2025 08:20:14 PM

స్వల్ప గాయాలతో బయటపడ్డ మరొకరు..

టెంట్ వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం..

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి  చెందిన రాంబోల్ నవీన్, రాంబో శ్యామ్ అనే ఇద్దరు మండలంలోని సిర్పెల్లి తండా(1) గ్రామంలో జరిగే ఒక ఫంక్షన్ లో టెంట్ (షామియానా) వేసేందుకు వెళ్లారు. గ్రామానికి అనుకొని చేనులో టెంటు వేస్తున్న రాంబోల్ నవీన్(24) దానికి ఇనుప పోల్ బిగించే క్రమంలో పైన ఉన్న 11 కెవి విద్యుత్ తీగలను గమనించక పోవడంతో ఆ తీగలు చేతిలో ఉన్న ఇనుప పోల్ కు ఆనుకోవడంతో కరెంటు సరఫరా జరిగి షాక్ కు గురై కింద పడిపోయాడు.

గమనించిన శ్యామ్ ఆయనను కాపాడే క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయించి హుటాహుటిన ఆయనను భైంసా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నవీన్ మృతి చెందాడు. స్వల్ప గాయాల పాలైన శ్యామ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నవీన్ కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలుసుకున్న కుబీర్ లోని గణేష్ నగర్, న్యూ అబాదిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి రాంబోల్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు కుభీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి వివరించారు.