14-12-2025 07:59:03 PM
7.6 కిలోల ఎండు గంజాయి, 366 గ్రాముల చాక్లెట్లు స్వాధీనం..
ముగ్గురు అరెస్ట్..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్ లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 7.6 కిలోల ఎండు గంజాయితో పాటు 366 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి(District Excise Officer Srinivas Reddy) తెలిపిన వివరాల ప్రకారం... కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో వికారాబాద్, తాండూరు, పరిగికు చెందిన ఎక్సైజ్ అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద బ్యాగుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నామని... కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన మహమ్మద్ జిలాని, ఎండి సైఫ్ సావేకారి, ఒరిస్సా రాష్ట్రం కటక్ జిల్లాకు చెందిన శిష్రూ కుమార్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.