calender_icon.png 15 December, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమానత్వం కోసం న్యాయ పోరాటం చేసిన అంబేద్కర్

14-12-2025 07:55:18 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): సామాజిక సమానత్వం కోసం న్యాయ పోరాటం చేసిన గొప్ప నాయకుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 244వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యఅతిథిగా భీమిడి జైపాల్ రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటంలో అంబేద్కర్ కృషి మరువలేనిదన్నారు.

దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ తన ప్రారంభ జీవితమంతా వివక్ష కష్టాలను ఎదుర్కొన్నాడని ఇది సామాజిక సమానత్వం న్యాయం కోసం పనిచేయడానికి అతన్ని ప్రేరేపించిందన్నారు. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ తో సహా బహుళ డిగ్రీలను పొందారని తెలిపారు. అంటరానితనం, కుల ఆధారిత వివక్షత వంటి సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రాథమిక హక్కులు, నిబంధనలను చేర్చడాన్ని నిర్ధారించడం ద్వారా, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, మానవ హక్కుల విజేతగా అంబేద్కర్ వారసత్వం తరతరాలుగా భారతీయులకు, ముఖ్యంగా దళిత సమాజానికి చెందిన వారికి స్ఫూర్తినిస్తూనే ఉన్నదన్నారు. ఈవిధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల్ యాదవ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, నాయకులు తాల్క రాములు, వేముల పరమేష్ గౌడ్, ఆర్. శ్రీనివాస్ యాదవ్, బి. గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.