08-08-2025 06:15:16 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఈరోజు హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్ నగర్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రారంభించిన ఇందిరమ్మ రెండు గదుల ఇండ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని, గతంలో తమ పేరు కేటాయించిన లిస్టులో ఉండేదని, ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసరికి తమ పేర్లు గల్లంతయ్యాయని దీనికి గల కారణం ఏంటో తమకు తెలియట్లేదు అని తమకు పార్టీలతో సంబంధం లేదని గత 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకుని నివసించామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామంటే గుడిసెలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలలో అద్దె గదిలలో నివసిస్తున్నామని తీరా చూస్తే తమ పేర్లు లిస్ట్ లో లేవని ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, అధికారులు తమ గోడును ఆలకించి దయతో తమకు ఇండ్లు కేటాయించాలని మొరపెట్టుకున్నారు. ఆందోళన కారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.