calender_icon.png 8 August, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం

08-08-2025 06:17:48 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని దహెగాం మండలం(Dahegaon Mandal) పీకలగుండంలో నాటుసారా రవాణా చేస్తున్న వాహనంతో పాటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి(Excise CI Ravi) తెలిపారు. ఆయన కథనం ప్రకారం, ఆ గ్రామంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కల్వడ గ్రామానికి చెందిన అజ్మీరా రాములు, పాల్త్య సురేష్ ఆటోలో 20 లీటర్ల నాటుసారా తరలిస్తుండగా స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై పి.లోభానంద్, ఐ.సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.