07-08-2025 09:05:36 PM
సమస్యల పరిష్కారానికి ఐఎన్టియుసి కృషి..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్(ఐఎన్టియుసి) కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్(Organizing Secretary Ramshetty Narender) తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపి, సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏరియాలోని కేకే 5 గనిపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి యూనియన్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరై, ఆందోళనలో పాల్గొని గని మేనేజర్ శంభునాథ్ పాండే కు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా ఏరియా స్టోర్స్ లో యూనియన్ స్టోర్స్ పిట్ కార్యదర్శి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, అనంతరం స్టోర్స్ ఇంచార్జ్ శశిధర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టియుసి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గుర్తు చేశారు. మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలని, జూలై 31 జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం జరిగిందని, వెంటనే బోర్డును రద్దుచేసి, మరల నిర్వహించాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ లో అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాప్, ట్రేడ్ మెన్స్, ఈపి ఆపరేటర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలన్నారు. కార్మికుల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను నిజం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు చెల్లిస్తున్నట్లుగా పెర్క్స్ పై ఐటి కార్మికులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలలుగా జరగలేదని, ప్రమాదాలు నివారణకై వెంటనే సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఏరియాలో చాలా క్వార్టర్లు శిథిలావస్థకు చేరినందున వెంటనే నూతన క్వార్టర్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నూతన బదిలీ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన క్యాడర్స్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతన పదోన్నతి పాలసీని తీసుకురావాలని కోరారు. ఏరియా ఆసుపత్రిలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రిఫరల్ సిస్టం మార్చాలని గని ప్రమాదాలకు గురైనప్పుడు యాక్సిడెంట్ గురైన కార్మికుని ముందుగా డిస్పెన్సరికి తీసుకువెళ్ళి తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడామ్ ద్వార సమయం వృధా అయ్యి విలువైన ప్రాణాలు కోల్పోతు న్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రికి పంపేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం 2024 25లో కార్మిక చచ్చిన లాభాల నుండి కార్మికుల 30% లాభాల వాటాను ప్రకటించాలని కోరారు. అదే విధంగా మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. వివిధ కారణాల ఉద్యోగుల కోల్పోయిన డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం కల్పించాలన్నారు.
విజిలెన్స్ విభాగంలో దాదాపు 3700 కేసులు పెండింగ్లో ఉన్న కార్మికుల తీవ్ర మనోసిక వేదన గురవుతుందని మెగా లోక్ అదాలత్ ఏర్పాటుచేసి అన్ని కేసులను ఒకేసారి పరిష్కరించలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల ప్రత్యేక అవసరాల దృష్ట్యా అన్ని గనులు విభాగాల్లో ప్రత్యేక టాయిలెట్లు రెస్టు రూమ్ లు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు కార్మిక సమస్యల పరిష్కారా నికి కార్మిక వర్గం ఇదే స్పూర్తితో ఆగస్టు 14న నిర్వహించు జిఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు హనుమండ్ల రాజేంద్రప్రసాద్, కృష్ణమోహన్, రణవేణ రాజు, కల్పన, నాగరాజు, నరేష్, రాజుకుమార్, రాజేందర్, జనార్దన్, ఐలయ్య, సంపత్ రావు, రమేష్, రాకేష్, సాయి కృష్ణ, నవీన్, నరేందర్, రమేష్ నాయక్, సమ్మయ్య, శ్రావణ్ కుమార్, రాం నారాయణ, బైరి సత్యనారాయణ, రామకృష్ణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.