calender_icon.png 7 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీడీఏ పీవో ఉద్యోగులకు రాఖీ కట్టిన ఈశ్వరి విశ్వవిద్యాలయం మాతలు

07-08-2025 08:29:33 PM

భద్రాచలం (విజయక్రాంతి): ప్రతి మనిషి పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠతో ఉండి దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూపోతే మనసులో వ్యక్తిత్వంలో రమణీయత పెరిగి భగవంతుని యొక్క ఆశీస్సుల వలన పరిపుష్టమైన జీవితాన్ని గడపవచ్చని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాతలు కృష్ణవేణి, భావన అన్నారు. గురువారం ఐటీడీఏ పీవో ఛాంబర్ లో ప్రాజెక్టు అధికారి బి రాహుల్ కు రాఖీ కట్టి జ్ఞాపికను అందించి, ఐటీడీఏ సమావేశ మందిరంలో భద్రాచలం ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాతలు ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఐటీడీఏ అధికారులు, ఉద్యోగుల ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రతి మనిషి తమలోని ఏదైనా ఒక ఆవగుణం పరమాత్మునికి గిఫ్టుగా అర్పించి రోజుకు ఐదు సార్లు శాంతి అభ్యాసం చేయాలని అన్నారు.

ప్రతి మనిషి పరమాత్మునికి సంబంధించిన దివ్య గుణములు పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ట, ఆత్మలో దృఢత, ఆలోచనలలో పై పక్వత, మనసులో సంతుష్టత, బుద్ధిలో దివ్యత, సంస్కారములు శ్రేష్టత, దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, కర్మలలో ప్రావీణ్యత, సేవలలో నమ్రత, వ్యవహారములో సరళత, స్నేహములో ఆత్మీయత, ఆహారములో సాత్వికత, జీవితములో సత్యత, వ్యక్తిత్వంలో రమణీయత, నిద్రలో నిశ్చింతతతో ఉండి ఆ పరమాత్ముని యొక్క దీవెనలు పొందినప్పుడే మనిషి ఎటువంటి ప్రలోభాలకు పోకుండా జీవించవచ్చని అన్నారు. అనంతరం ఉద్యోగులందరికీ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భద్రాచలం బృందం సభ్యులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.