07-08-2025 08:31:33 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి 2025 చివరి నాటికి భారతదేశం నుండి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్(Mandal Medical Officer Dr. Bhukya Nagesh Nayak) కోరారు. మండలంలోని లోయపల్లి గ్రామంలో గురువారం క్షయవ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 10 మందికి వైద్య పరీక్షలు జరిపారు. ఎవరికైనా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని, ప్రభుత్వం ఉచితంగా అందించే మందులను వాడి వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ నివారణ నోడల్ పర్సన్ కుంభం వీరయ్య,ఎల్ టీ చొక్కయ్య,నాగమ్మ,మనీలా,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.