calender_icon.png 7 August, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా చూడాలి

07-08-2025 08:53:36 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సౌళ్ళ క్రాంతి కుమార్ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా మండల కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్ ఘర్ తిరంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి(Convener Mallarapu Santhosh Reddy) హాజరై మాట్లాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రజలలో జాతీయ భావం పెంపొందించాలన్నారు.

దేశ స్వాతంత్రం కోసం మహనీయుల పోరాటాలని స్మరించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశం పట్ల, జాతీయ జెండా పట్ల జాతీయ భావం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టి తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపి,జిల్లా కౌన్సిల్ నెంబర్ మెరుగు అంజా గౌడ్, బాద నరేష్, కుడుకల జనార్ధన్, చిగురు వెంకన్న, జిల్లాల్ల మల్లేశం, మీస శంకర్, దీటి సత్తయ్య, తిరుపతి, కమిటీగారి పద్మ, పిరాల విజయ్ కుమార్, సర్దాని లింగం తదితరులు పాల్గొన్నారు.