calender_icon.png 7 August, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు సన్మానం

07-08-2025 08:50:41 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి(Rotary Club Assistant Governor Dr. M. Jaipal Reddy) మాట్లాడుతూ, నేతన్నలను కాపాడుకోవాలంటే వారు నేస్తున్న దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. నేసిన దుస్తువులు చౌకగా లభించి మన్నిక ఎక్కువగా ఉంటాయని అన్నారు. సమాజంలో నేతన్నలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. 

అనంతరం సన్మాన గ్రహీతలైన చేనేత కార్మికులు దాసరి నారాయణ, బండారి గంగాధర్, ఇప్పకాయల గంగారాం, బాల నర్సును పుష్పగుచ్చం అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు చాట్ల రాజేశ్వర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్, చేనేత జిల్లా అధ్యక్షులు సబ్బాని ధర్మపురి, రోటరీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, జిల్లా సెక్రెటరీ భుస వెంకట స్వామి, కోశాధికారి సాప నర్సింలు, రోటరీ సభ్యులు కస్ప వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.