07-08-2025 08:45:23 PM
కుబీర్: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలంలోని సాంగ్విలో బుధవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులకు ఒక్కరే టీచరు ఉండడంతో విద్యార్థుల చదువులు ఎలా కొనసాగుతాయని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మండల విద్యాధికారి సాంగ్వి గ్రామానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు అడిషనల్ టీచర్ ని పంపుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మెటర్నరీ లీవ్ లో ఉన్న టీచర్ స్థానంలో మరో ఉపాధ్యాయురాలిని అలాట్ చేశారు.
గురువారం సాంగ్విలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు టీచర్ ని పరిచయం చేశారు. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించిన మండల విద్యాధికారి విజయకుమార్ ను గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. మరో ఇద్దరు గ్రామానికి చెందిన విద్యావంతులను వాలంటీర్లు గా గ్రామస్తులే సమకూర్చుకున్నారు. మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను సాంగ్వి ప్రాథమిక పాఠశాలకు పోస్టింగులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎంఈవో గ్రామస్తులకు తెలిపారు.