calender_icon.png 7 August, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్రాలను ఆదరించాలి

07-08-2025 08:36:27 PM

పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుస్సా సమ్మయ్య..

మణుగూరు (విజయక్రాంతి): చేనేత వస్త్రాలను ఆదరించి, నేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దుస్సా సమ్మయ్య సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోజు రోజుకు ప్రాధాన్యత కోల్పోతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను విడుదల చేయడంతో పాటు, చేనేతల కళారూ పాలకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయో రోజుల్లో వరుస పండగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించడంతో పాటు కార్మికులకు చేయూతను అందించాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్ర నాగరాజు, ఆర్గ నైజింగ్ సెక్రటరీ కుర్రి నరసింహా రావు, కొరివి బసవయ్య, కూచన మల్లేష్, గోదారి రాజేశ్వరరావు, కోటా రాంబాబు, సిరిపురం కోటేశ్వరరావు పాల్గొన్నారు.