calender_icon.png 20 January, 2026 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు బెంగళూరు

20-01-2026 12:00:00 AM

వడోదర, జనవరి 19 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతున్న ఆర్సీబీ ఐదో విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇప్పటి వరకూ ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ వేటలో దూసుకెళుతోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మృతి మంధానతో కలిసి గౌతమి నాయక్ జట్టును ఆదుకుంది.

మంధాన (26)తో కలిసి 60 పరుగులు, రిఛా ఘోష (27)తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. గౌతమి నాయక్ 55 బంతుల్లోనే 73(7 ఫోర్లు, 1 సిక్స్), రిఛా ఘోష్ 20 బంతుల్లో 3 సిక్సర్లతో 27 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. బెత్ మూనీ(3), సోఫీ డివైన్(0) , కనిక(0) డకౌటయ్యారు. గార్డనర్(54) హాఫ్ సెంచరీతో స్కోరు 100 దాటింది. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే 3, డిక్లార్క్ 2 వికెట్లు పడగొట్టింది.