calender_icon.png 20 January, 2026 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల్లో చెప్పండి

20-01-2026 12:00:00 AM

బంగ్లా బోర్డుకు ఐసీసీ డెడ్‌లైన్

ఢాకా, జనవరి 19: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 వరల్ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నెలకొన్న వివాదానికి మరో రెండురోజుల్లో తెరపడనుం ది. ఈ అంశంపై ఐసీసీ జనవరి 21న తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ లోపు ఏదో ఒకటి తేల్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ డెడ్‌లైన్ విధించింది. బంగ్లాదేశ్‌లో హిందువులు హత్యలకు నిరసనగా ఐపీ ఎల్ నుంచి ఆ దేశానికి చెందిన ప్లేయర్లకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. వేలంలో కోల్ కతా నైట్‌రైడర్స్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను కొన్నప్పటకీ బీసీసీఐ ఆదేశాలతో విడుదల చేసింది. అప్పటి నుంచీ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలు దిగింది.

భారత్‌లో జరిగే టీ 20 ప్రపంచకప్ ఆడేందుకు తాము రాలేమం టూ, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. దీనికి ఐసీసీ నిరాకరించినప్పటకీ బీసీబీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్ వెళ్లి మ్యాచ్‌లు ఆడటం మాత్రం సాధ్యం కాదని, ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై చివరిసారి బంగ్లాదేశ్ బోర్డుతో చర్చించేందుకు ఐసీసీ ప్రతినిధి బృందం ఢాకా వెళ్లినా కూడా చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ బీసీబీకి ఫైనల్ డెడ్‌లైన్ విధించింది. జనవరి 21వ తేదీకల్లా ఏదో ఒకటి తేల్చకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని తేల్చేసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది.

ఫిబ్రవరి 7న కోల్‌కత్తాలో వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలోని మిగతా రెండు మ్యాచ్‌లు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనుండగా, చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగా ల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల చర్చల్లో బం గ్లాదేశ్  ఐర్లాండ్ గ్రూప్ మార్పు ప్రతిపాదనను కూడా ఐసీసీ ముందుకు తీసుకెళ్లింది. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీతో పాటు ఐర్లాండ్ కూడా పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు తుది నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేతుల్లోనే ఉంది. భారత్‌కు వచ్చేందుకు ఒప్పుకోకపోతే, ఐసీసీ ప్రత్యామ్నా య జట్టును ఎంపిక చేయనుంది.