17-10-2025 05:40:33 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజెన్లకు మైరుగైన వైద్య సేవలందించాల సీనియర్ సిటిజన్ రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంచార వైద్య వాహనాల ద్వారా లేవలేని స్థితిలో ఉన్న వారి ఇంటివద్దకే వెళ్ళి వైద్య సేవలందించాలన్నారు. ఈ సౌకర్యాలు ప్రతి సీనియర్ సిటిజెన్ ఉపయోగించుకోవాలని కోరారు. చాలా మందికి ఈ సౌకర్యం తెలియక చాలా అవస్థలు పడుతున్నారని తలియజేశారు. వైద్య సిబ్బంది కూడా సీనియర్ సిటిజెన్లకు సహకరించగలరని ప్రత్యేకంగా కోరారు.