calender_icon.png 17 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు బీజేపీనే అడ్డంకి

17-10-2025 08:01:26 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీజేపీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం దానిని ఆమోదించకుండా ఆపేసిందని విమర్శించారు. బీసీ సంఘాల నాయకులు బీజేపీ తీరును ఖండించాలని, తమ అసలైన రంగును ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో బిల్లును ఎందుకు ఆమోదించలేదో, 9వ షెడ్యూల్‌లో ఎందుకు చేర్చలేదో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. అక్టోబర్ 18న సిపిఎం పార్టీ స్వతంత్రంగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని చాటాలని పిలుపునిచ్చారు.