17-10-2025 07:54:42 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు కోర్స్ డైరెక్టర్ వామనుమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు ఒక రోజు డిజిటల్ లెర్నింగ్ అంశంపై శుక్రవారం శిక్షణ ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ నుండి కోఆర్డినేటర్లు భగత్ కుమార్, సత్యనారాయణ మూర్తి, విజయలక్ష్మి, మండల విద్యాధికారి శైలజ, డిజిటల్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ తదితర అంశాల గురించి ఉపాధ్యాయులు నేర్చుకోవడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి జీవితంలో డిజిటల్ లెర్నింగ్, సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధికి ఉపయోగపడాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ వ్యవహరించిన షారిక్, రాజన్న, ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ అంశాల గురించి క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా విద్యార్థులు పుస్తక బోధనతో పాటు డిజిటల్ లెర్నింగ్ నైపుణ్యాలను కూడా నేర్చుకోవాలన్నారు. వర్తమాన సమాజంలో డిజిటల్ లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యత, వినియోగం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తతో ఉండడం వంటి అంశాలను రిసోర్స్ పర్సన్స్ ఉదహరించారు. ఈ కార్యక్రమం లో కోఆర్డినేటర్ భరత్ కుమార్, మండల ఎం.ఆర్.సి సిబ్బంది సి.ఆర్.పి లు పాల్గొన్నారు.