17-10-2025 07:51:04 PM
బహుమతులు అందజేత
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మేరా యువభారత్ ఆధ్వర్యంలో శుక్రవారం సుల్తానాబాద్ లో మండల స్థాయి పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి సెలక్షన్ చేయడం జరిగింది, అందులో భాగంగా సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు, కబడ్డీ బాయ్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా అథ్లెటిక్స్ లో 100 మీటర్స్ రన్నింగ్ పోటీలో బాయ్స్ విభాగంలో పానేటి శాంతి కుమార్ మొదటి స్థానం సాధించాడు, భయ్యా మహేష్ ద్వితీయ స్థానం సాధించారు. గర్ల్స్100 మీటర్స్ రన్నింగ్ పోటీలో పెండెం అభినయశ్రీ మొదటి స్థానం సాధించడం జరిగింది.
నిట్టూరి అంకిత ద్వితీయ స్థానం సాధించారు. షాట్ పుట్ బాయ్స్ విభాగంలో బయ్య మహేష్ మొదటి స్థానం సాధించాడు, పానీటి శాంతి కుమార్ ద్వితీయ స్థానం సాధించారు, చెస్ పోటీలో బాయ్స్ నుంచి ద్వితీయ స్థానం ఉష్తం శివప్రసాద్, గర్ల్స్ నుంచి అలియా ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక విజేతలకు బహుమతులు అందించి , అభినందించారు. ఈ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేసి ఈ విజయాన్ని అందించిన కళాశాల పిడి సతీష్ ను ప్రత్యేకంగా అభినందించారు.