calender_icon.png 17 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నిఘా కెమెరాలు ఏర్పాటు

17-10-2025 07:32:14 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యచరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బోడుప్పల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ... పరిశుభ్రతను పెంపొందించడం పరిశుద్ధతను ప్రోత్సహించడం, పారిశుద్ధ పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రదేశాలలో సెన్సార్ ఆధారిత సీసీటీవీ కెమెరాలు ఆటోమేటెడ్ వాయిస్ అనౌన్స్మెంట్ సిస్టం లను ఏర్పాటు చేశామని.  7వ డివిజన్ శివాలయం రోడ్ యందు,  21 వ డివిజన్ అయ్యప్ప స్వామి గుడి రోడ్డు బంగారు మైసమ్మ గుడి నుండి  చెనగచర్ల రోడ్డు వరకు ఏర్పాటు చేయడం  జరిగింది.

స్మార్ట్ గా కెమెరాలు నిరంతరం చెత్తవేయు వ్యక్తులను, వాహనాలను గుర్తించడానికి సెన్సార్లతో అమర్చబడి ఉన్నాయి. ఆటోమేటెడ్ వాయిస్ అనౌన్స్మెంట్ సిస్టంతో ముందస్తుగా రికార్డ్ చేయబడిన వాయిస్ ప్రకటనను హెచ్చరికలను జారీ చేయడం జరుగుతున్నది. ఇట్టి సిస్టం ద్వారా చెత్త వేసిన వ్యక్తులను గుర్తించి 500 రూపాయలు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని,  ప్రజలు రోడ్ల పైన చెత్త వేయరాదు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ వాహనంలో చెత్తని వేయాలని  కమిషనర్ కోరారు.